చాట్‌జీపీటీ వాడకంలో మీరు ఆరితేరిపోయారా? అయితే రూ. కోటిన్నర జీతం మీకోసం వెయిటింగ్!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ( ChatGPT ) గురించే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.దీనికి విశేష ఆదరణ లభిస్తుండటం దానికి కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు.

 Companies Offering Huge Salaries To Chatgpt Experts Details, Chatgpt, Chatgpt Ex-TeluguStop.com

ఏఐ టూల్స్‌తో విశేష లాభాలు ఉండడంతో ఈ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడింది.అవును, చాట్‌జీపీటీ నిపుణుల కోసం ఇపుడు కంపెనీలు అన్వేషిస్తున్నాయి.

సమర్ధులైన చాట్‌జీపీటీ నిపుణులకు ఏడాదికి రూ.కోటిన్నర వరకూ ఆఫర్ చేసేందుకు కంపెనీలు రెడీగా వున్నాయంటే మీకు నమ్మశక్యం కాదు.కానీ ఇది అక్షరాల సత్యం.చాట్‌జీపీటీ నిపుణుల కోసం ఇపుడు చాలా కంపెనీలు జల్లెడ పడుతున్నాయి.

చాట్‌జీపీటీ గురించి మీరు వినే వుంటారు.ఈ ఏఐ టూల్స్( AI Tools ) మనుషుల కంటే వేగంగా మానవ తరహాలో అనేక పనులు క్షణాల్లో ఫినిష్ చేయడంతో ఉద్యోగుల స్ధానంలో ఏఐ టూల్స్‌ను వినియోగించేందుకూ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.టెక్నాలజీ రంగంలో చాట్‌జీపీటీ అవసరం పెరుగుతుండటంతో ఏఐ చాట్‌బాట్‌ను( AI Chatbot ) ఉపయోగించే నిపుణులకు పెద్దసంఖ్యలో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి.ఉద్యోగ ఖాళీలున్న కంపెనీల్లో 91 శాతం కంపెనీలు చాట్‌జీపీటీ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌ను మాత్రమే నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయంటే మీరు నమ్ముతారా? రెజ్యూమ్‌ బిల్డర్ చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇపుడు లింక్డిన్‌లో పలు కంపెనీలు చాట్‌జీపీటీ నిపుణులకు ఏకంగా ఏడాదికి రూ.కోటిన్నర చెల్లించేందుకూ సిద్ధమైనట్టు ప్రకటనలు చేస్తుండడం విశేషం.ఉదాహరణకు అమెరికాకు చెందిన ఓ హెచ్ఆర్ కంపెనీ చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి ఏఐ టూల్స్‌పై పట్టున్న అభ్యర్ధులు సీనియర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పోస్టుకు అవసరమని ఏడాదికి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకూ వార్షిక వేతనం చెల్లిస్తామని ఆఫీసియల్ గా ప్రకటించింది.మరో టెక్ కంపెనీ ఇంటర్‌ఫేస్‌ ఏఐ రిమోట్ మెషీన్ ఇంజనీర్‌కు రూ.కోటిపైన వార్షిక వేతనం చెల్లించేందుకు వాకిన్ జరుపుతోంది.ఏఐతో ఉత్పాదకత పెరగడంతో పాటు సమయం ఆదా కావడం, కంపెనీ సామర్ధ్యం మెరుగవడం వంటి సానుకూల ఫలితాలు ఉంటాయని సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు కొందరు చెప్పుకొచ్చారు.

Highpaying jobs for ChatGPT experts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube