అవును, వినడానికి విడ్డురంగా వున్నా మీరు విన్నది నిజమే.ఈ స్మార్ట్ యుగంలో బట్టల నుంచి ఆహారం దాకా ఏ వస్తువైనా ఆన్‌లైన్‌లో షాపింగ్( Online Shopping ) చేసే సౌకర్యం ఉండడంతో కొన్ని ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ లకు మంచి గిరాకీ ఏర్పడింది.
ఇపుడు జనాలు అవసరమైతే తప్ప నేరుగా దుకాణాలకెళ్లి వస్తువులను కొనడం లేదు.అయితే ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో కొంత ఆలస్యం అనేది సహజంగా జరుగుతుంది.
ఒక వారం రోజులు లేదంటే పది రోజులు మాత్రమే ఆలస్యం జరుగుతుంది.ఎందుకంటే గూడ్స్ ( Goods ) అనేవి ఒక్కో రాష్ట్రము నుండి ఒక్కో రాష్ట్రము వరకు రావలసి ఉంటుంది.అయితే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆర్డర్ నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిందంటే మీరు నమ్ముతారా?
![Telugu Ali Express, Alibaba, Delhi, Delivery, Latest, Nitin Agarwal, Parcel-Late Telugu Ali Express, Alibaba, Delhi, Delivery, Latest, Nitin Agarwal, Parcel-Late](https://telugustop.com/wp-content/uploads/2023/06/Man-receives-product-from-AliExpress-4-years-after-placing-order-detailss.jpg)
అవును, తాజాగా ఓ వ్యక్తి తనకు ఎదరైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకోవడంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.విషయంలోకి వెళితే… ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్( Nitin Agarwal ) అనే టెకీ 2019లో చైనీస్ వెబ్‌సైట్ అలీబాబా( Alibaba ) ద్వారా ఒక ఆర్డర్ పెట్టారు.అక్కడినుండి ఇండియాలో నిషేధానికి గురైన అలీఎక్స్‌ప్రెస్ ద్వారా ఆర్డర్ పెట్టిన నితిన్ తన ఆర్డర్ కోసం పడిగాపులుగాశాడు.ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఈరోజు తనకు ఆర్డర్ డెలిరీ అయిందంటూ అతను పట్టరాని ఆనందంతో ఆ ఆర్డర్ పార్సిల్‌ను ఫోటో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ వ్యక్తి.
![Telugu Ali Express, Alibaba, Delhi, Delivery, Latest, Nitin Agarwal, Parcel-Late Telugu Ali Express, Alibaba, Delhi, Delivery, Latest, Nitin Agarwal, Parcel-Late](https://telugustop.com/wp-content/uploads/2023/06/Man-receives-product-from-AliExpress-4-years-after-placing-order-detailsd.jpg)
ఈ క్రమంలో మనోడు ‘ఎన్నడూ ఆశను వదులుకోవద్దు!’ అంటూ ఓ స్లోగన్ కూడా రాశాడు.ఆ పార్సిల్ మీద 2019 మే అన్న అక్షరాలు ఉండడం మనం గమనించవచ్చు చూడండి.కాగా నితిన్ అగర్వాల్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో మంచి ప్రతిస్పందనే వస్తోంది.ఇకపోతే ఆ వ్యక్తి అలీ ఎక్స్‌ప్రెస్ నుంచి రిఫండ్ కూడా అందింది అంటూ చెప్పుకురావడం కొసమెరుపు.
అలా రిఫండ్ పంపించి మరీ అలీబాబా సదరు కస్టమర్ ఆర్డర్ చేసింది పంపడమంటే సాధారణం విషయం కాదు.కాగా ఈ విషయం పైన మిశ్రమ స్పందన వస్తోంది.
కొంతమంది అలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది లెండి అని కామెంట్స్ చేస్తే, మరికొంతమంది నాలుగైదేళ్ల తరువాత పార్శిల్ అందితే ఏంటి, అందకపోతే ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.