వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో క్షుద్రపూజల ముఠా కలకలం సృష్టించింది.మాయ మాటలతో మహిళలను ట్రాప్ చేయడంతో పాటు మహిళలతో నగ్న పూజలు చేయిస్తున్నట్లు ఓ బాధితురాలు ప్రొద్దుటూరు రూరల్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని పది మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో నలుగురు మహిళలతో పాటు పూజారి కూడా ఉన్నాడని తెలుస్తోంది.
నిందితులు తాడిపత్రి, తిరుపతికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.అనంతరం నిందితుల నుంచి వీడియో క్లిప్పులు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నగ్న పూజల అనంతరం తాము అడిగినంతా ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుంటారని వెల్లడించారు.