-రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని
మహిళలకు అత్మస్థైర్యాన్ని నింపుతూ,మహిళలకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడి సాధించగలను అనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించడానికి జిల్లా పోలీస్ శాఖ( District Police Department ) ఆధ్వర్యంలో రూపొందించిన ఆపరేషన్ జ్వాల( Operation Jwala ) (సెల్ఫ్ డిఫెన్స్) పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ ఆత్మ రక్షణ కోసం “ఆపరేషన్ జ్వాల”(సెల్ఫ్ డిఫెన్స్) కార్యక్రమం ఏర్పాటు చేసి మూడు నెలల పాటు బాలికల, మహిళల కళశాలలో, పాఠశాలలోని విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపడం అభినందనీయం.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
మహిళా పరిరక్షణలో తెలంగాణ పోలీస్ అద్భుత ఫలితాలు సాధించిందని, సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళ సాధికారిత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని, మహిళలు ఎంతో శక్తివంతులని, అలాంటి మహిళలకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళల,బాలికల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్రములో ప్రత్యేకంగా షీ టీమ్ లు ఏర్పాటు చేసి మహిళలకు,బాలబాలికలకు రక్షణగా( Protection of women and children ) నిలుస్తూ సేవలందించడం జరుగుతుంది అన్నారు.
మహిళ పరిరక్షణలో తెలంగాణ పోలీస్ అద్భుత ఫలితాలు సాధించింది అన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మహిళల రక్షణ విషయంలోనే కాక మహిళలకు ఉద్యోగ కల్పన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, మహిళలకు పోలీసు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించి రాష్ట్రంలో మహిళా పోలీస్ అధికారుల సిబ్బంది యొక్క సంఖ్యను పెంచడం జరిగిందని అన్నారు.
జిల్లాలోని మహిళల రక్షణ నే ద్యేయంగా మహిళల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వివిధ కార్యక్రమాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుంది అని అందులో భాగంగా “అభయ అప్”,”ఆపరేషన్ జ్వాల”,”షీ టీమ్”( Abhaya App ,Operation Jwala, She Team ) పేర్లతో వివిధ కార్యక్రమలు చేపడుతూ జిల్లాలోని మహిళల కు అత్మస్థైర్యాన్ని నిపుతున్న జిల్లా ఎస్పీ,జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి.మంత్రి వెంట జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య,మున్సిపల్ ఛైర్పర్సన్ జింధం కళ, పోలీస్ అధికారులు ఉన్నారు.