కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అవును, దానికి తగ్గట్టే ఇటీవల కాలంలో జనాల్లో క్రియేటివిటీ( Creativity ) బాగా పెరిగిపోయింది.
ఎలాంటి సమస్య వచ్చినా తమ మెదడుకి పనిచెప్పి ఆ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఆలోచించే గుణం ఉండాలే కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకపోయినా పర్లేదు అని నిరూపిస్తున్నారు జనాలు.
యువతులైతే ఒకేగానీ, ఇక్కడ ఓ వృద్ధుడు చేసిన పనికి జనాలు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం భగ్గుమంటున్న ఎండలకు కాలు బయట పెట్టలేని పరిస్థితి.కారుంటే తప్ప దూరప్రయాణాలు చేయలేని విధంగా వుంది వాతావరణం.అలాంటిది బైక్ లేదా సైకిల్ పై బయటకు వెళ్లడం అంటే ఇక నరకప్రాయమే.
ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.అయితే అతని దగ్గర ఓ సైకిల్( Cycle ) మాత్రమే ఉంది.
దీంతో ఆ వృద్ధుడు వినూత్నమైన ఆలోచన చేశాడు.ఎండ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా సైకిల్ ని ఒక కారు మాదిరి( Car ) మార్చేసాడు.
ఏకకాలంలో తన దగ్గర ఉన్న సైకిల్ ని ఎండ వర్షం బారి నుంచి తప్పించుకునే విధంగా తయారు చేసుకున్నాడు.
అయితే దానికి అతగాడికి రూపాయి ఖర్చు కూడా అయి ఉండదు.తనదగ్గర వున్న కర్రలతోనే దాన్ని సాధించాడు.ఇంకేముంది కట్ చేస్తే మండుటెండలో ఆ సైకిల్ కారుపైన హాయిగా ప్రయాణం చేసేస్తున్నాడు.
ఇంతకీ అతను ఏం చేశాడంటే.కొన్ని కర్రలను తీసుకొని సైకిల్ చుట్టూ సమాంతరంగా పేర్చి ఓ పందిరిలా కట్టాడు.
పైన ఎండ తగలకుండా వర్షం పడకుండా ఓ టార్పన్ కట్టి ఉంచాడు.ఇలా సైకిల్ ను సిద్ధం చేసుకుని రోడ్డుపై కూల్ గా ప్రయాణం సాగించాడు ఆ వృద్ధుడు.
కాగా అతని తెలివితేటలు చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.ఆలోచన ఉండాలేగాని ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు అని తెలుసుకుంటున్నారు.