తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.గత ఏడాది చాలా మంది ప్రముఖులు మరణించడం తెలిసిందే.
సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది.అయితే ఈ ఏడాది స్టార్టింగ్ లో నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించడం తెలిసిందే.
చాలా రోజులు చావుతో పోరాడి తారకరత్న తుది శ్వాస విడిచారు.ఇక ఇదే సమయంలో ఇటీవల సీనియర్ నటుడు శరత్ బాబు సైతం అనారోగ్యానికి గురై.
మరణించడం జరిగింది.మొన్ననే చెన్నైలో( Chennai ) కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
కాగా తాజాగా ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.వాసు( K.Vasu ) హైదరాబాద్ ఫిలింనగర్ లో తన నివాసంలో కన్నుమూయటం జరిగింది.ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన మొట్టమొదటి సినిమా “ప్రాణం ఖరీదు” కి దర్శకత్వం వహించారు.
ఇంకా కోతల రాయుడు, అమెరికా అల్లుడు, తోడు దొంగలు, పల్లెటూరి పెళ్ళాం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, అల్లుళ్లు వస్తున్నారు తదితర సినిమాలను డైరెక్ట్ చేయడం జరిగింది.కే వాసు ఎంతో సీనియర్ దర్శకులు కావడంతో ఆయన మరణ వార్త తెలుసుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.