తమిళ హీరో విజయ్ ఆంటోనీ( Vijay Anthony ) మరోసారి బిచ్చగాడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయిదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
భారీ కలెక్షన్స్ ను నమోదు చేయడం తో పాటు అప్పట్లో బుల్లి తెరపై కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.ఇప్పుడు కూడా టీవీ లో బిచ్చగాడు వచ్చిన సమయంలో మంచి రేటింగ్ నమోదు అవుతూనే ఉంటుంది.
తాజాగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అంటూ వచ్చిన బిచ్చగాడు 2 సినిమా( Bichagadu 2 ) కచ్చితంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.అన్నట్లుగానే ఈ సినిమా భారీ గా వసూళ్లు నమోదు చేస్తోంది.సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 7.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది.ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం చూసి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది.బాబోయ్ ఈ స్థాయిలో సినిమా వసూళ్లు దక్కించుకుంటుందా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.మేకర్స్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ రూ.10 కోట్ల ను వసూళ్లు చేయడం ఖాయం అంటూ నమ్మకం వ్యక్తం చేశారు.
బిచ్చగాడు 2 సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు.పైగా ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.దాంతో ఈ సినిమా వసూళ్లు పాజిటివ్ గా వస్తున్నాయి.సినిమా కలెక్షన్స్ భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో మరియు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ముందు ముందు మరింతగా కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బిచ్చగాడు 2 సినిమా కు పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం వల్ల కచ్చితంగా ముందు ముందు మరింతగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.సెంటిమెంట్ సినిమా అవ్వడంతో పాటు గతంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల ఈ సినిమా కి జనాల్లో పాజిటివ్ బజ్ ఉంది.
కనుక భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.