టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మాస్ మహారాజా రవితేజ( Raviteja ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ధమాకా సినిమాతో( Dhamaka ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కాగా క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఆ తర్వాత వరుసగా ఖిలాడీ,రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే రవితేజ ప్రస్తుతం ఒక వ్యాధితో బాధపడుతున్నారట.రవితేజ ప్రస్తుతం వయసు 50 ఏళ్ళు అన్న విషయం అందరికీ తెలిసిందే.
కానీ రవితేజ మొహం బాడీ చాలా స్ట్రింక్ అయ్యి స్కిన్ని అవ్వడంతో చాలామంది రవితేజ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని భావిస్తున్నారు.రవితేజ ఆకలి లేని ల్యూక్ అనే వ్యాధితో బాధపడుతున్నారట.ఈ వ్యాధి కారణంగా రవితేజకు సరిగా ఆకలి వేయకపోవడంతో పాటు ఆయన ఫేస్ స్కిన్ మొత్తం డల్ అయిపోయి చర్మం సాగిపోయినట్లుగా కనిపిస్తుందట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.