విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా...!

నల్లగొండ జిల్లా:విద్యుత్లో ఓల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలనిబీజేపీ( BJP ) దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ అన్నారు.మంగళవారం దేవరకొండ మండలం కట్టకొమ్ముతండా రైతుల విద్యుత్ సమస్యలపై ( Farmers )బీజేపీ ఆధ్వర్యంలో ఏడిఈ ఆఫిస్ ఎదుట ధర్నా నిర్వహించి,ఏడిఈకి వినతిపత్రం అందజేశారు.

 Farmers' Dharna In Front Of Vidyut Ade Office...! ,nalgonda District , Farmers ,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 40 వ్యవసాయ బోర్లకు ఒకటే ట్రాన్స్ఫారమ్ ఉందని,లో ఓల్టేజ్ కారణంగా బోర్లు సరిగ్గా నడవక,కాలిపోతూ రైతులు ఇబ్బంది పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.అలాగే తండా గృహాలలో లో ఓల్టేజ్ సమస్య ఏర్పడి విద్యుత్ ఉపకరణాలు కాలిపోతూ ప్రజలు నిత్యం సతమతమవుతున్నారని అన్నారు.

<

గ్రామంలో ఉన్న ట్రాన్సఫార్మర్ చుట్టూ రక్షణ ఫెంక్షన్ లేకపోవటంతో మూగజీవులు షాక్ కు గురవుతున్నాయన్నారు.గత కొన్నాళ్లుగా స్థానిక విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పంచింది వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.నెల రోజుల లోపల సమస్య పరిస్కారం చేస్తామని విద్యుత్ ఏడిఈ ( ADE 0స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, చింతపల్లి మండల అధ్యక్షులు శివార్ల రమేష్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ మల్లేష్ నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దశరథ్ నాయక్,గ్రామ రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube