త్రివిక్రమ్( Trivikram ) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకీ కుడుముల ( Venky Kudumula )డైరెక్టర్ గా మారి ఛలో సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత నితిన్( Nitin ) హీరోగా భీష్మ సినిమా చేశాడు…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.దాంతో వెంకీ కుడుముల వరుస రెండు హిట్లు కొట్టి స్టార్ డైరెక్టర్ అయ్యాడు…ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా లో రెండు కీలక పాత్రలు ఉన్నాయట వాటి కోసం ఇద్దరు స్టార్ నటులని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
అందులో ఒకరు సీనియర్ హీరో వడ్డే నవీన్( Vadde Naveen ) కాగా ఇంకొకరు తమిళ్ టాప్ నటుడు విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )ని తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు ?, తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు?, చుట్టూ ఉన్న జనం అతని పై చూపించే సింపతీకి అతను ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణంలో వెంకీ కుడుముల ఈ పాయింట్ ను ఫన్నీ వే లో చూపించబోతున్నాడని తెలుస్తోంది.
మొత్తానికి సీరియస్ కథతో నితిన్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది.ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉన్నాయి…ఇక వీళ్లిద్దరూ ఈ సినిమా తో హైట్రిక్ హిట్ కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…
.