తన వర్గం ఎమ్మెల్యేలతో శివసేనను చీల్చి భాజాపాతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సింధేకు ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదని తెలుస్తుంది .అవ్వడానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ తెరవనక చక్రం బిజెపి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్( Devendra Padnavis ) తిప్పుతున్నారని అంతా అంటున్నారు .
ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన కంట్రోల్ లోనే నడుస్తుందని .పదవులు నియామకాలు అన్ని ఆయనే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి .సిందే తాను ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే పరిపాలనంతా తన కంట్రోల్లో ఫడ్నవిస్ తెచ్చుకున్నారని, ఇది గమనించినప్పటికీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితుల్లో సిందే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

తమను కాదని ఎన్సిపి తో కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ( Uddhav Thackeray ) మీద ఉన్న కోపంతోనే సిందే ను చేరదీశారు తప్ప ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఏమీ బిజెపికి లేదని పైగా ఎమ్మెల్యేలను చేర్చగలిగారు తప్ప కార్యకర్తలు అభిమానులు ఇంకా ఉద్దవ్ వైపే ఉన్నారని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల లో ఆ విషయం నిరూపించబడిందని వచ్చే ఎన్నికలలో సిందే తో కలిసి వెళ్తే గెలుపు కష్టమన్న అభిప్రాయానికి భాజాపా అధిష్టానం వచ్చిందని అందుకే ఎన్సీపీతో స్నేహం కోసం భాజపా ప్రణాళికలు రచిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఎన్సిపి తో భాజపా కలిస్తే తన అవసరం తీరిపోతుందన్న విషయం సిందేకు బాగా అవగాహన ఉంది.అందుకే జరుగుతున్న పరిణామాలునిశితం గా గమనిస్తున్న ఆయన అజిత్ పవార్( Ajit Pawar ) గనుక ఆయన వర్గం ఎమ్మెల్యేలతో భాజపాల్లో చేరితే తాము తప్పుకుంటామని తమ వర్గం ఎమ్మెల్యే అయిన సంజయ్ శీర్శత్ తో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటింప చేసినట్టుగా తెలుస్తుంది .ఎంత .సహకరించినప్పటికీ భాజాపా తనను లెక్క చేయకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది ఎన్సీపి కూడా భాజపాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉందని, దీనికి శరత్ పవర్ ఆశీస్సులు కూడా ఉన్నాయని ముందు అజిత్ ను పంపించి తరువాత ఆయన వస్తారని ,, ఇలా తెరవెనుక చక్రం తిప్పడం శరద్ పవర్ కి అలవాటేనన కొంతమంది విశ్లేషిస్తున్నారు మరి అనేక మలుపులు తిరుగుతున్న మరాఠా రాజకీయం చివరికి ఏ గమ్యానికి చేరుతుందో చూడాలి
.