నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu )పుట్టినరోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్వయంగా చంద్రబాబు మహిళలకు భోజనం వడ్డించటంతో పాటు వస్త్రాలు బహుకరించారు.
అనంతరం కాకర్ల ట్రస్ట్ వ్యవస్థాపకుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సంజీవని ఆరోగ్యరథం వాహనాన్ని చంద్రబాబు ప్రారంభించడం జరిగింది.ఈ వాహనం ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు కాకర్ల సురేష్( Kakarla Suresh ) స్పష్టం చేశారు.
ఇప్పటికే తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను పేద ప్రజలకు అందించినట్లు పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో ట్రస్ట్ సేవా కార్యక్రమాలను చంద్రబాబు కూడా అడిగి తెలుసుకుని అభినందించడం జరిగింది.అనంతరం మార్కాపురంలో నిర్వహించిన “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై మండిపడ్డారు.వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.