టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో ఎవరినీ వదిలేదని తెలిపారు.
ఈ ఇష్యూలో ఎంత పెద్దవాళ్లున్నా వదలే ప్రసక్తి లేదని వెల్లడించారు.
టీఎస్పీఎస్సీకి ఉన్న నిబద్ధత దేశంలో ఏ బోర్డుకూ లేదని మంత్రి తలసాని తెలిపారు.
టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలన్నీ పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు.రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.