నాగర్ కర్నూలు జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి.అచ్చంపేట మండలం పుల్జాలలో ఐదేళ్ల చిన్నారిపై శునకాలు దాడి చేశాయి.
కుక్కలు చేసిన దాడిలో బాలుడికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధిత చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కుక్కల బెడద నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడిలో పలువురు పెద్దవాళ్లతో పాటు చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే.