మోటో నుంచి కొత్త 5జీ ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే..

మోటారోలా( Motorola) తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G73 5Gని భారతదేశంలో విడుదల చేసింది.ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది.ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

 New 5g Phone Launch From Moto.. The Price And Features , Moto G73 5g, Motorola-TeluguStop.com

ఈ మొబైల్ 8జీబీ ర్యామ్, 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, థింక్‌షీల్డ్ మొబైల్ సెక్యూరిటీతో లాంచ్ అయింది.

మోటో G73 5G((Moto G73 5G) ఇండియాలో మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,999.ఇది లూసెంట్ వైట్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది.కస్టమర్లు లాంచ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.ఇందులో సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలుదారులు రూ.2,000 తగ్గింపు పొందొచ్చు.మోటో G73 5G ఆండ్రాయిడ్ 13 ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా వస్తుంది.

120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే దీనిలో అందించారు కాబట్టి స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు.ఈ ఫోన్ వెనకాల 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మాక్రో డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఆఫర్ చేశారు.సెల్ఫీలు(selfie), వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ఇచ్చారు.

మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేయవచ్చు.

ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో సహా అనేక రకాల కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ మైక్రోఫోన్లతో కూడిన స్టీరియో స్పీకర్‌లు, IP52-రేటెడ్ వాటర్ రిపెల్లెంట్ బిల్డ్ ఉన్నాయి.

ప్యాకేజీ బాక్స్‌లో ఛార్జర్‌ వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube