సినీ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) నంద్యాల టూర్ ప్రభావం పోలీసులపై పడింది.అల్లు అర్జున్ పర్యటన నేపథ్యంలో ఇద్దరి కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.
ఈ మేరకు ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లను( SB Constables ) వీఆర్ పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.స్వామినాయక్,( Swamy Nayak ) నాగరాజుపై( Nagaraju ) అధికారులు చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఎన్నికల సంఘం( Election Commission ) సీరియస్ కావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేసినట్లు సమాచారం.జిల్లా ఎస్పీ, నంద్యాల డీఎస్పీ, సీఐపై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే కిందిస్థాయి సిబ్బందిపై వేటు వేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.