బ్రిటన్‌లో ఒక బార్ ఒక విచిత్రమైన ఆలోచన చేసింది.అది ఏమిటంటే, ప్రముఖ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరుతో ఒక బీర్‌ను తయారు చేసింది.
ఈ బీర్‌కు “ఒసామా బిన్ లాగర్”(Osama bin lager) అని పేరు పెట్టింది.ఈ అసాధారణ పేరు చాలా మంది కస్టమర్లను ఆకర్షించింది, బ్రూవరీ వెబ్‌సైట్, ఫోన్ లైన్లను ముంచెత్తింది.
“ఒసామా బిన్ లాగర్” ఒక లైట్ బీర్, దీనికి సిట్రస్ రుచి ఉంటుంది.ఇది ఇప్పుడు బ్రూవరీలో అత్యధికంగా అమ్ముడైన బీర్‌గా మారింది.
బీర్ బాటిల్ డిజైన్ కూడా ప్రత్యేకమైనది, దీనిలో బిన్ లాడెన్ కార్టూన్ ఉంటుంది.మిచెల్ బ్రూయింగ్ కో.యజమానులు లూక్, కేథరీన్ మిచెల్, “కిమ్ జాంగ్ ఏల్”, “పుటిన్స్ పోర్టర్” వంటి నొటోరియస్ లీడర్లను హాస్యాస్పదంగా ఎగతాళి చేసే పేర్లతో డ్రింక్స్ తయారు చేశారు.ఈ వ్యక్తుల ఇమేజ్‌ను ఫన్నీగా చూపించాలని వారు ప్రయత్నిస్తున్నారు.
అలాగే వినూత్నమైన పేర్లతో, డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ బీర్‌పై చాలా విమర్శలు వచ్చాయి.కొందరు దీన్ని అభ్యంతరకరమైన, అసహ్యకరమైన ప్రచారం అని భావిస్తారు, మరికొందరు దీన్ని ఫన్నీ, క్రియేటివ్ అటెంప్ట్ అని అభినందిస్తున్నారు.ఓనర్ మిచెల్స్ తమ ఉత్పత్తులను మంచి కార్యం కోసం కూడా ఉపయోగిస్తారు.‘ఒసామా బిన్ లాగర్’(Osama bin lager beer) ప్రతి బారెల్ అమ్ముడైనప్పుడు, వారు 9/11 దాడుల బాధితులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థకు €10 విరాళంగా ఇస్తారు.వారు సోషల్ మీడియాలో బీర్ చిత్రాలను పంచుకున్నారు, అవి వైరల్ అయ్యాయి, ఆన్‌లైన్‌లో ఈ ప్రత్యేకమైన బీర్ గురించి అనేక కామెంట్లు వచ్చాయి.
ఇకపోతే బెంగళూరులోని ఒక రెస్టారెంట్ కలుషితమైన వర్థూర్ సరస్సు పేరును ఆల్కహాల్ డ్రింక్ కోసం వాడేసింది.ఓ కాక్టెయిల్‌ను ‘వర్థూర్ ఓవర్‌ఫ్లో’ అని పిలిచింది.ఈ పేరు సరస్సు అధిక కాలుష్య స్థాయిలను సూచిస్తుంది.బార్లు ఈ క్రియేటివ్ నేమ్స్ తో కస్టమర్లను ఆకర్షించడం పనిగా పెట్టుకున్నాయి.