శరీరంలో ఐరన్ లెవెల్స్ ను అమాంతం పెంచే జ్యూసులు ఇవి.. తప్పక డైట్ లో చేర్చుకోండి!

మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఐరన్( Iron ) ఒకటి.ఐరన్ అనేది శరీర పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన ఖనిజం.

 These Two Juices Helps To Increase Iron Levels In Body Details, Healthy Juices,-TeluguStop.com

ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే హిమోగ్లోబిన్ మరియు కండరాలకు ఆక్సిజన్‌ను అందించే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను తయారు చేయడానికి మ‌న బాడీ ఐర‌న్ ను ఉపయోగిస్తుంది.అలాగే కొన్ని హార్మోన్లను తయారు చేయడానికి కూడా ఐర‌న్ అనేది చాలా అవ‌స‌రం.

ఎప్పుడైతే ఐర‌న్ కొర‌త ఏర్ప‌డుతుందో అప్పుడు మ‌న శ‌రీరంలో అనేక స‌మ‌స్య‌లు ప్రారంభం అవుతాయి.

ప్ర‌ధానంతో ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త( Anemia ) త‌లెత్తుతుంది.

ఇది అలసట, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు మరియు చర్మం పాలిపోవ‌డం వంటి లక్షణాలకు దారితీస్తుంది.అలాగే ఐర‌న్ లోపం కార‌ణంగా అవయవాల ప‌నితీరు దెబ్బ తింటుంది.

బలహీనత, వేగవంతమైన హృదయ స్పందన, త‌ల‌నొప్పి వంటి ఎన్నో స‌మస్య‌లు ఐర‌న్ లోపం వ‌ల్ల త‌లెత్తుతాయి.ఈ నేప‌థ్యంలోనే శ‌రీరంలో ఐర‌న్ లెవెల్స్ ను అమాంతం పెంచే రెండు సూప‌ర్ జ్యూసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Anemia, Beetrootcarrot, Tips, Healthy, Iron, Iron Deficiency, Iron Rich-T

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్( Beet Root ) ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు,( Pomegranate ) ఒక కప్పు క్యారెట్ ( Carrot ) ముక్కలు మరియు నాలుగు నుంచి ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసి స్ట్రైనర్‌ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.లేదా నేరుగా కూడా ఈ జ్యూస్ ను తీసుకోవచ్చు.రోజుకు ఒక గ్లాసు ఈ బీట్ రూట్ క్యారెట్ మ‌రియు దానిమ్మ జ్యూస్ ను తీసుకుంటే ఐరన్ కొరత దెబ్బకు పరారవుతుంది.

Telugu Anemia, Beetrootcarrot, Tips, Healthy, Iron, Iron Deficiency, Iron Rich-T

అలాగే మ‌రొక జ్యూస్ కోసం బ్లెండ‌ర్ తీసుకుని ఒక కప్పు యాపిల్ ముక్కలు, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, నాలుగు నుంచి ఐదు ఫ్రెష్ పాల‌కూర ఆకులు, వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు మ‌రియు ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా బ్లెండ్ చేసుకోవాలి.ఆపై స్టైన‌ర్ సాయంతో జ్యూస్ ను ఫిల్ట‌ర్ చేసుకుని సేవించాలి.ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్న వారికి ఈ జ్యూస్ కూడా ఎంతో ఉప‌యోగ‌కరంగా ఉంటుంది.నిత్యం ఈ జ్యూస్ తాగితే శ‌రీరంలో ఐర‌న్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube