తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఈ ఫ్యామిలీ లో ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు.
ఇక అందులో నలుగురు స్టార్ హీరోలే కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి.అయితే నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్( Varun Tej ) మాత్రం వరుస సినిమాలను చేస్తున్నాడు అయినప్పటికి ఈ మధ్య ఆయనకు సక్సెస్ లు వెనకబడిపోతున్నారనే చెప్పాలి.
ఇక ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.అయినప్పటికీ ఆ సినిమాలు ఏవి కూడా ఆశించిన విజయాన్ని సాధించకపోగా ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ సినిమాలు ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆయన కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా( Matka ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్( Ram Charan ) ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఒక భారీ సక్సెస్ కొడితే అది మెగా ఫ్యామిలీ( Mega Family ) సక్సెస్ గా భావిస్తారు కాబట్టి వరుణ్ తేజ్ ఎలాగైనా సరే స్టార్ హీరోగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.కాబట్టి ఆయన కోసం రామ్ చరణ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది… ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తనదైన రీతిలో తన తమ్ముడైన వరుణ్ తేజ్ కు సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ అనుకున్న సక్సెస్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.