సీనియర్ నటి కవిత( Senior Actress Kavitha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం కవిత పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కవిత షాకింగ్ విషయాలను వెల్లడించారు.బాలనటిగానే కెరీర్ ను మొదలుపెట్టిన కవిత సిరిసిరిమువ్వ సినిమాతో( Sirisiri Muvva Movie ) తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో సైతం ఆమె నటించారు.
భర్త దశరథరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ నన్ను మ్యారేజ్ చేసుకున్నారని కవిత వెల్లడించారు.
నేను హీరోయిన్ గా రెండు నెలలు కష్టపడి సంపాదించే డబ్బును ఆయన ఒక్కరోజులో ఖర్చు చేసేవారని కవిత పేర్కొన్నారు.అలా అని నా డబ్బును ఆయన అస్సలు ముట్టుకునేవారు కాదని కవిత చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందు నేను పిల్లల్ని కననని కండీషన్ పెట్టి పెళ్లి చేసుకున్నానని కవిత వెల్లడించారు.

పెళ్లి తర్వాత మా అత్తయ్య మాత్రం త్వరగా పిల్లలు కావాలని అడిగారని ఆమె పేర్కొన్నారు.నాకు పిల్లలు వద్దని అమ్మతో చెప్పానని కవిత తెలిపారు.పుడితేనే కదా చనిపోతారు పుట్టకపోతే చనిపోరు కదా అని అన్నానని ఆమె అన్నారు.
తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే నేను బ్రతికానని కవిత అన్నారు.తమ్ముడిని మరిచిపోలేక నేను అలాంటి కామెంట్లు చేశానని కవిత చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత కొన్నిరోజులకే నేను ప్రెగ్నెంట్( Pregnant ) అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.తమ్ముడి ఫోటో చూసి రోజూ ఏడ్చేదానినని నా బాధ చూసి భర్త వరల్డ్ టూర్ కు తీసుకెళ్లారని ఆమె అన్నారు.పాప పుట్టిన తర్వాత లైఫ్ సంతోషంగా మారిందని కవిత పేర్కొన్నారు.మొత్తం నాకు ముగ్గురు సంతానం అని కరోనా సమయంలో భర్త, కొడుకు చనిపోయారని ఆమె తెలిపారు.
ఆ విషయాల గురించి చెబుతూ నటి కవిత ఎమోషనల్ కావడం గమనార్హం.