బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రాజెక్ట్ కే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
దీపికా పదుకొనే ప్రస్తుతం గర్భవతి( Pregnant ) కాగా కొంతమంది నెటిజన్లు ఆమె గురించి తాజాగా ఫేక్ బేబీ బంప్ అంటూ ట్రోల్స్ చేయగా ఆ ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.కొన్నిరోజుల క్రితం దీపిక పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆ సమయంలో దీపికకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడం జరిగింది.ఆ సమయంలో దీపిక బేబీ బంప్ తో ( Deepika Baby Bump ) కనిపించడంతో ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కంటారంటూ వైరల్ అయిన వార్తలు ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది.
అయితే ఆమె బేబీ బంప్ తో కనిపించినా కొంతమంది మాత్రం ఆమెది ఫేక్ బేబీ బంప్ అంటూ ఇప్పటికీ కామెంట్లు చేస్తున్నారు.అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ విషయంలో దీపికకు మద్దతు ఇస్తున్నారు.

అయితే అలా ట్రోల్స్ ( Trolls ) చేస్తున్న వాళ్లకు చెక్ పెట్టాలనే ఆలోచనతో తాను ఇన్ స్టాగ్రామ్ వేదికగా లైవ్ కు వస్తానని ఆమె పేర్కొన్నారు.ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఆమె ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ట్రోల్స్ చేసేవాళ్లకు దీపిక గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.2018 సంవత్సరం చివర్లో దీపిక రణ్ వీర్( Ranveer ) పెళ్లి చేసుకున్నారు.