విదేశాలకు వ్యాపారం పెట్టిన వారందరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు.కొందరు ఫెయిల్ కూడా కావచ్చు.
తాజాగా అలాంటి ఒక ఇండియన్ కథ వైరల్ గా మారింది.ఈ చెఫ్ పేరు పడం వ్యాస్.
( Padam Vyas ) ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో( Sydney ) ఈ 67 ఏళ్ల భారతీయ చెఫ్ ఒక పాప్-అప్ స్టాల్‌ను( Pop-Up Stall ) ఏర్పాటు చేశాడు.అద్భుతమైన భారతీయ వంటకాలను ప్రదర్శించాడు.
అయితే, ఈ ఇండియన్ ప్రయత్నాలకు ఫలితం దక్కలేదు.ఎందుకంటే ఆయన ఫుడ్ స్టాల్ ముందు కస్టమర్ల జాడే కనిపించలేదు.
ఈ దృశ్యాన్ని చిత్రీకరించే ఒక హృదయ విదారక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.వీడియోలో, చెఫ్ వ్యాస్ తన స్టాల్ వద్ద కూర్చొని, ఆసక్తిగా కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నాడు.
కానీ సమయం గడిచేకొద్దీ, ఆయన హ్యాపీ ఫేస్ నిరాశగా మారుతుంది.ఈ వీడియోను ది కొలొనియల్ రెస్టారెంట్స్( The Colonial Restaurants ) షేర్ చేసింది.
ఇందులో, చెఫ్ వ్యాస్ చేసిన నోరూరించే సమోసాలు, చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్, సీక్ కబాబ్, రోగన్ జోష్ వంటి వంటకాలు కనిపించాయి.కానీ ఆయన ఆశించినంత జనం రాలేదు.
చివరికి వర్షం రావడంతో, చెఫ్ వ్యాస్ బాధతో తన స్టాల్ ను మూసివేసి, ఒక ఆశ్రయం కోసం వెతుకుతూ బయలుదేరాడు.
అయితే, ఈ వీడియో చాలా మందిని కదిలించింది.సోషల్ మీడియాలో చాలా మంది చెఫ్ వ్యాస్‌కు( Chef Vyas ) మద్దతుగా నిలిచారు.చాలా మంది ఆయన స్టాల్‌ను సందర్శించాలని, ఆయన వంటకాలను రుచి చూడాలని కోరుకున్నారు.
చాలా మంది ఆయనకు ఆర్థిక సహాయం కూడా అందించారు.ఆ మద్దతుతో చెఫ్ వ్యాస్‌కు ఒక కొత్త జీవితాన్ని అందించింది.
ఆ వీడియో 920,000కు పైగా వ్యూస్ పొందింది, ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది.చాలా మంది చెఫ్ వ్యాస్‌కు ప్రోత్సాహం, మద్దతును అందించగా, కొందరు భారతీయ వీధి ఆహారం పరిశుభ్రతను ప్రశ్నిస్తూ విమర్శించారు.
ప్రారంభంలో ఎదురైన నిరాశతో పాటు, ఆన్‌లైన్ వినియోగదారుల నుంచి వచ్చిన హార్ట్ టచింగ్ రెస్పాన్స్ చెఫ్ వ్యాస్ రోజును మార్చివేసింది.చాలా మంది ఆయన రుచికరమైన ఆహారాన్ని రుచి చూడాలని కోరుకున్నారు, ఆస్ట్రేలియాలో( Australia ) లేకపోవడం వల్ల దానిని రుచి చూసే అవకాశం లేకపోవడంపై చింతించారు.తరువాత, చెఫ్ వ్యాస్ మాట్లాడుతూ కొంతమంది కస్టమర్లు తన స్టాల్‌ను సందర్శించారని, కానీ వర్షం కారణంగా ఆ ఒక్క రోజు ఎవరు షాప్‌కు రాలేదని స్పష్టం చేశారు.ఔట్‌డోర్ కేటరింగ్ కోసం అనుమతులు అవసరమయ్యే ఆస్ట్రేలియన్ వాతావరణం, వ్యవస్థను బయటి వ్యక్తులు పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని ఆయన నొక్కి చెప్పారు.