కంబోడియా సైబర్ నేరస్థుల(Cyber Criminals) నుంచి తెలుగు వారికి విముక్తి లభించింది.ఈ క్రమంలో సుమారు 38 మంది బాధితులు కంబోడియా(Cambodia) నుంచి విశాఖకు (Visakha) చేరుకున్నారు.
విడతల వారీగా బాధితులను కంబోడియా నుంచి విశాఖ పోలీసులు (Visakha) తీసుకువస్తున్నారు.కాగా ఒక్క ఏపీ రాష్ట్రం నుంచే సుమారు 150 మంది కంబోడియా వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
డేటా ఎంట్రీ వర్క్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారని తెలుస్తోంది.కంబోడియాకు తీసుకెళ్లి బాధితులను చైనా గ్యాంగ్ కు అప్పగిస్తున్నారని.
అదేవిధంగా వారితో అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు (cyber criminals)చేయిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే కేసులో లోతైన విచారణ కోసం దాదాపు ఇరవై మంది సిబ్బందితో సిట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.