బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారి.తరువాత తుపానుగా మారింది.
ఈ తుపానుకు రెమల్ గా నామకరణం చేశారు.ఖేపుపరా (బంగ్లాదేశ్) Bangladesh )కి దక్షిణంగా సుమారు 610 కిలోమీటర్లు, సాగర్ దీవులకు “పశ్చిమ బెంగాల్”( West Bengal) దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, కానింగ్ (పశ్చిమ బెంగాల్) కి దక్షిణంగా 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుపాను రేపు ఉదయం తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.రేపు అర్ధరాత్రికి సాగర్ ద్వీపం – ఖేపుపరా (Sagar Island ,Khepupara)మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఒడిశాతో పాటు బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.