ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో అరటి ఒకటి.అరటి పండ్లు ( Bananas )ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.
పైగా చౌక ధరకే లభిస్తాయి.పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ అరటి పండ్లను ఇష్టంగా తింటుంటారు.
అయితే అప్పుడప్పుడు మార్కెట్లో మనకు ఎర్ర అరటి పండ్లు కనిపిస్తుంటాయి.చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
కానీ వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది ఎర్ర అరటి పండ్ల వైపు పెద్దగా మొగ్గు చూపరు.
కానీ ఎర్ర అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎర్రటి అరటిపండ్లలో(Red Bananas) యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఎర్ర అరటి పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల అదిరిపోయే ఆరోగ్య లాభాలను మీ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా గుండెకు ఎర్ర అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి.ఎర్ర అరటిలో ఉండే అనేక ఎలక్ట్రోలైట్లు (Electrolytes)మరియు పొటాషియం గుండె కండరాలను బలంగా మారుస్తాయి.రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి అండంగా నిలుస్తాయి.
అలాగే దృష్టి లోపాలతో బాధపడుతున్న వారు నిత్యం ఒక ఎర్ర అరటి పండు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నాయి.ఎర్ర అరటిపండులో ఉండే బీటా-కెరోటిన్(Beta-carotene) మరియు లుటీన్ ఆరోగ్యమైన దృష్టికి మద్దతు ఇస్తాయి.వయస్సు-సంబంధిత మచ్చల క్షీణతను నివారించడంలో ఉత్తమంగా సహాయపడతాయి.
వెయిట్ లాస్(Weight loss) అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఎర్ర అరటి పండ్లు ఎంతో ఉపయోకరంగా ఉంటాయి.అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీ కంటెంట్ ఉండటం కారణంగా ఎర్ర అరటి కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.
చిరు తిండ్లపై మనసు మళ్లకుండా చేస్తుంది.
ఎర్ర అరటి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్(Fiber content) జీర్ణక్రియకు తోడ్పడుతుంది.మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.ఇక ఎర్ర అరటిలో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే సెల్యులార్ డ్యామేజ్ను నివారిస్తాయి.
మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.కాబట్టి ఇకపై అరటి పండ్లు కనిపిస్తే వాటిని అస్సలు వదలిపెట్టకండి.