శభాష్ సీనన్న.. సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని నిలిపిండు.. ఆ కుటుంబం పాలిట దేవుడయ్యిండు

రాజన్న సిరిసిల్ల జిల్లా: శుక్రవారం రోజు సాయంత్రం హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డమిది శ్రీనివాస్.తండ్రి శంకర్ మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన గాంధీ నగర్ కు చెందినా చిలగాని అనూహ్య అనే మహిళా.

 Constable Srinivas Gave Cpr Saved Life Of A Woman, Constable Srinivas ,cpr ,save-TeluguStop.com

ఇంట్లో నుండి కేకలు వినబడడంతో వెంటనే స్పందించి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి ఆమెకు సీపీఆర్ చేసిన అక్కడే రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్.అక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్లు గమనించేలోపే, అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు.

ఆమెకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్‌ చేశారు.అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తర‌లించారు.కానిస్టేబుల్ చాకచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.ప్రస్తుతం ఆమెకు తారక రామారావు హాస్పటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నరు.

సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఈ సందర్బంగా అభినందించిన పలువురు నెటిజన్లు.హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube