ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్( Tejaswi Yadav ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) బీజేపీ ఏజెంట్ గా పని చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నికలలో బీజేపీ( BJP ) ఓడిపోనుందని ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి బీజేపీ పీకేను రంగంలోకి దింపిందని విమర్శించారు.ప్రశాంత్ కిషోర్ నీ జెడియు జాతీయ ఉపాధ్యక్షుడు చేయడానికి కారణం అమిత్ షా( Amit Shah ) అంటూ అప్పట్లో నితీష్ కుమార్( Nitish Kumar ) బహిరంగంగా కామెంట్లు చేశారు.
దానిని ఇప్పటివరకు బీజేపీ నాయకులు ఎవరూ ఖండించలేదు.
ఆయన బీజేపీలో ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు.ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలో చేరిన అది నాశనం అవుతుంది అంటూ తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పీకే కి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదని ప్రతి సంవత్సరం వేర్వేరు వ్యక్తులతో కలిసి పని చేస్తుంటాడని అన్నారు.
ఈ రకంగా ఒకరి డేటాను తీసుకొని మరొకరికి ఇస్తాడు.కానీ బీజేపీ కోసం పనిచేస్తూ వారి సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని సీరియస్ కామెంట్లు చేశారు.
బీజేపీ వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ కి నిధులు సమకూరుస్తుందని తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.