విజిటింగ్ వీసాతో దుబాయ్ వెళ్తున్న వారు తెలుసుకోవలసిన కొత్త రూల్స్..!!

ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటకంపై దృష్టిపెట్టాయి.ప్రధానంగా దుబాయ్( Dubai ) పర్యాటకానికి కేంద్రంగా ఉంది.

 New Rules To Be Known By Those Going To Dubai On Visiting Visa Details, Tourism,-TeluguStop.com

మామూలుగానే దుబాయ్ లో ఉపాధి కోసం భారత్ నుండి ప్రపంచ దేశాల నుండి చాలామంది వెళ్తుంటారు.ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, ఏపీ. మరి కొన్ని రాష్ట్రాల నుండి దుబాయ్ లో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.చిన్న చిన్న పనులకు కూడా వేలల్లో జీతం పొందుతారు.

ఈ క్రమంలో కరోనా తర్వాత దుబాయ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి విజిటింగ్ వీసా( Visiting Visa ) అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ఈ వీసా అందుబాటులోకి వచ్చాక.ప్రపంచ దేశాల నలుమూలల నుండి చాలామంది పర్యాటకులు( Tourists ) దుబాయ్ కి వెళ్తున్నారు.ఈ క్రమంలో తాజాగా విజిటింగ్ వీసాకి సంబంధించి కొత్త రూల్స్ దుబాయ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.

విషయంలోకి వెళ్తే విజిటింగ్ వీసాతో దుబాయ్ కి వెళ్లేవారి వీసాల నిబంధనల్లో అక్కడి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.

దుబాయ్ కి వెళ్లే సందర్శకులు తప్పనిసరిగా కనీసం 3000 AEDలతో పాటు రిటర్న్ టికెట్( Return Ticket ) బుక్ చేసుకొని ఉండాలి.డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డయినా ఉండాలి.దుబాయ్ లో ఎక్కడ ఉండనున్నారో ముందే తెలపాల్సి ఉంటుంది.

ఇవి చూపించకపోతే బోర్డింగ్ కు అనుమతించరు.గురువారం కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో ( Cochin Airport ) ఇరవై మందికి దుబాయ్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube