ఆఫ్రికన్ అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న సింహం.. క్లోజ్-అప్ షాట్ చూస్తే?

సింహాలు( Lions ) అద్భుతమైన వేట నైపుణ్యాలతో అడవికి రాజులుగా అవతరించాయి.అవి తమను రక్షించుకోవడానికి లేదా ఆహారం కోసం అడవిలో చాలా దూరాలు ప్రయాణిస్తాయి.

 This Close-up Shot Of Lion Enjoying His Time In African Forest Video Viral Detai-TeluguStop.com

అయితే, మానవులు సింహాల వేటను చూడటం చాలా అరుదు, అలానే వీటిని దగ్గరగా చూడటం చాలా కష్టం.చాలామంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్‌ కూడా సింహాల క్లోజప్ షాట్స్( Lion Closeup Shots ) తీయడానికి కష్టపడుతుంటారు.

ఎందుకంటే అలాంటి క్షణాలు కూడా దొరకడం చాలా అరుదు.

అయితే ఇటీవల, లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఒక ఫొటోగ్రాఫర్ దక్షిణాఫ్రికాకు( South Africa ) వెళ్లిన సమయంలో ఒక సింహానికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించాడు.

ఈ వీడియోను గ్లెన్ గారిఫ్ కన్జర్వేషన్‌లో షూట్ చేశాడు, ఇక్కడికి చేరుకోవడానికి 32 గంటల విమాన ప్రయాణం, 4 గంటల డ్రైవ్ అవసరం.ఈ వీడియోలో, సింహం మొదట ప్రశాంతంగా కనిపిస్తుంది, ఫొటోగ్రాఫర్ ఎంత దగ్గరగా ఉన్నాడో అంచనా వేయడం కష్టతరం చేస్తుంది.

హఠాత్తుగా, ఆ సింహం వెన్నులో వణుకు పుట్టేలా గర్జిస్తుంది.ఈ అద్భుత సింహానికి షలోమ్( Shalom ) అని పేరు పెట్టారు.

సింహం గర్జన( Lion Roar ) వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది, 6,000 కి పైగా వ్యూస్ సంపాదించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ, “చివరకు, మీరు అక్కడికి చేరుకున్నారు! ఫారెస్ట్ కింగ్ షలోమ్ గర్జనను వినడం చాలా బాగుంది.” అని అన్నారు.మరొకరు సింహం శక్తివంతమైన గర్జన సమయంలో సూర్యరశ్మి దానిపై పడి అది చాలా అందంగా కనిపించిందని అన్నారు. “పెద్ద టెడ్డీ బేర్”లా షలోమ్ కనిపిస్తోందని దానిని ముట్టుకోవాలని అనిపిస్తోందని ఇంకొందరు పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో ఒక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఒక సింహం, దాని పిల్లలను చాలా చక్కగా వీడియో తీశాడు.ఈ వీడియో కూడా బ్యూటిఫుల్ గా ఉండి చాలా మందిని ఆకట్టుకుంది.ఈ వీడియోలో ఒక నీటి కుంటలోని వాటర్ తాగిన తర్వాత, ఓ పిల్ల సింహం తన స్నేహితులతో ఆడటానికి ప్రయత్నించింది.అయితే, తల్లి జోక్యం చేసుకొని, సింహం పిల్లను నోటితో పట్టుకొని సురక్షిత ప్రదేశానికి తరలించింది.

సింహం తల్లి పిల్లను తన నోటిలో మృదువుగా పట్టుకుంది, చిన్న పిల్ల తన అందమైన గర్జనతో తనని వదిలేయమంటూ కోప్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube