వైరల్ వీడియో: సంతోషంతో డాన్స్ వేసిన కావ్య.. శోక సంద్రంలో రాజస్థాన్ అభిమానులు..

ఐపీఎల్ 17 సీజన్ ( IPL 17 Season )ఫైనల్ మ్యాచ్ కు చేరుకుంది.క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad )జట్టు రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించి సగర్వాంగా ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో పోరాడేందుకు సిద్ధమయింది.

 Viral Video Kavya Danced With Joy, Rajasthan Fans In Grief, Ipl 2024, Srh, Rr, K-TeluguStop.com

ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ కు చేరింది.క్వాలిఫైయర్ వన్ లో ఓటమికి ప్రతికారంగా క్వాలిఫైడ్ 2 లో రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయనందుకొని ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇకపోతే ఐపిఎల్ 2024 సీజన్ మొదటి నుండి వరుస విజయాలతో ట్రాక్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) ప్రయాణం చివరకు కాస్త నెమ్మదించింది.లీగ్ మ్యాచ్లో తన చివరి నాలుగు మ్యాచ్లను కోల్పోగా ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించి క్వాలిఫైయర్ 2 కు అర్హత సాధించింది.ఇక శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ జట్టు నిర్ణయించిన 176 పరుగుల నిర్ణిత లక్ష్యాన్ని అందుకోలేక చివరికి 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ఎస్ఆర్హెచ్ 36 పరుగుల భారీ విజయంతో ఫైనల్లోకి అడుగు పెట్టింది.

ఇక ఈ విజయంతో హైదరాబాద్ జట్టు అభిమానులు సంబరాల్లో మునిగి తేలగా., మరోవైపు రాజస్థాన్ చెందిన అభిమానులు మాత్రం ముఖాల్లో నిరాశ.మరికొంతమంది కళ్ళలో ఏకంగా నీళ్లు పెట్టుకుంటూ అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక క్వాలిఫైయర్ 2 లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్( Kavya Maran ) కాస్త నిరాశగా కనిపించగా చివరికి రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో వికెట్లు పడుతుండగా మారన్ ముఖం 1000 వాట్స్ బల్బుల వెలిగిపోయింది.

చివరగా హైదరాబాద్ విషయంలో కావ్య మారన్ ఆనందంతో ఏకంగా గ్రౌండ్ లోనే స్టెప్స్ వేయడం సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.మొదటగా గంతులు వేసిన కావ్య ఆ తర్వాత సరదాగా డాన్స్ కూడా చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మరింత ఖుషిగా సంబరాలు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube