ఏపీ ఎన్నికలు( AP Elections ) ముగిసాయి.ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు విదేశాలలో పర్యటిస్తున్నారు.
ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరగటంతో తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు.
మరోపక్క రూరల్ అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడంతో రెండోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.పది రోజులలో ఫలితాలు రాబోతున్నాయి.
వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) లండన్ పర్యటనలో ఉన్నారు.ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) వైఎస్ జగన్ పై సోషల్ మీడియాలో సీరియస్ పోస్ట్ పెట్టారు.13 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉద్దేశించి మండిపడ్డారు.
“నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు.రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు.మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు”.
అంటూ షర్మిల ట్వీట్ చేశారు.