యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఒక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా విష ప్రచారం చేయిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతోంది.
తాజాగా జరిగిన ఒక ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara Movie ) నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ కు( Fear Song ) 50 మిలియన్ల వ్యూస్ వ్యూస్ వచ్చాయి.
ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను తారక్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా మొదట ఎక్కువగా వచ్చిన లైక్స్ ఆ తర్వాత తగ్గిపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.లక్షకు పైగా వచ్చిన లైక్స్ సగానికి పైగా తగ్గిపోవడం వెనుక స్టార్ హీరో పీఆర్ టీం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మొదట బాట్స్ ద్వారా లైక్స్ కొట్టించి తర్వాత వాటిని తొలగించి తారక్ గురించి నెగిటివ్ ప్రచారం( Negative Campaign ) జరిగేలా ఒక స్టార్ హీరో పీఆర్ టీం ప్లాన్ చేసిందని సమాచారం అందుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం ఓర్వలేక ఒక స్టార్ హీరో ఈ విధంగా తన పీఆర్ టీంతో చేయిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని భవిష్యత్తు సినిమాలు సైతం అంచనాలను మించి మెప్పించడంతో పాటు గ్లోబల్ రేంజ్ లో తారక్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచుతాయని ఆయన అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.ఎన్టీఆర్ ను అనవసరంగా టార్గెట్ చేయవద్దని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.