జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలనకై వచ్చిన యూనియన్ సర్వీస్ కి చెందిన ఐఎస్ఎస్, ఐఈఎస్ కి చెందిన 25 మంది బృంద సభ్యులు జిల్లాలో ముగింపు పర్యటన సంధర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్.మోహన్ రావుతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అద్భుతమైన ప్రగతి కనబడుతుందని ప్రభుత్వం రైతుబందు, దళిత బంధు,పల్లె ప్రకృతి, బృహత్ వనాలు, మనవూరు మనబడి,రైతు వేదికలు,కేసీఆర్ కిట్స్ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని తెలిపారు.
బృంద సభ్యులు పర్యటన అనుభవాలు తెలియజేస్తూ జిల్లాలో ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి ఒక మైలు రాయిగా నిలుస్తోందని, రైతు బంధు,రైతు బీమా, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్న సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలో స్వయం సహాయక సంఘాల పని తీరు, ఉపాధి హామీ పనులు, నర్సరీల నిర్వహణ,పల్లె ప్రకృతి వనాలు,రైతు బంధు,దళిత బంధు అమలు,కంటి వెలుగు కార్యక్రమం అమలు ద్వారా ఎంతో అనుభూతిని పొందామని బృంద సభ్యులు వారి అభిప్రాయాలను ఈ సందర్బంగా పంచుకున్నారు.జిల్లాలో తుంగతుర్తి దేవుని గుట్ట తండా,కోదాడ,ఎర్రవరం, తిరుమలగిరి,బండ్లపల్లి, మోతె,కూడలి,నేరేడుచర్లలో బృంద సభ్యులు పర్యటించారు.
అనంతరం బృంద సభ్యులకు మెమోంటోలు అందచేసి సత్కరించారు.ఈ సమావేశంలో జెడ్.
పి.సిఈఓ సురేష్,డిపిఓ యాదయ్య,పిడి ఐసిడిఎస్ జ్యోతిపద్మ,డిఏఓ రామారావు నాయక్, సిపిఓ వెంకటేశ్వర్లు,వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.