కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తునివు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది.
కొన్నిరోజుల క్రితం అజిత్ అభిమాని ఒకరు ప్రాణాలు కోల్పోగా తాజాగా అజిత్ మరో ఫ్యాన్ ప్రాణాలను కోల్పోయారు.వీరబాహు అనే వ్యక్తి అజిత్ వీరాభిమానులలో ఒకరు కావడం గమనార్హం.
తాజాగా తునివు సినిమా చూడటానికి వీరబాహు తన ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లడం జరిగింది.అయితే వీరబాహు మద్యం తాగి ఉండటం వల్ల అతనిని థియేటర్ లోకి అనుమతించలేదు.
అదే సమయంలో థియేటర్ సిబ్బంది మద్యం తాగడం విషయంలో అవమానకరంగా మాట్లాడటం జరిగింది.అయితే సినిమా చూడటానికి తనను అనుమతించలేదనే రీజన్ వల్లే వీరబాహు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అభిమానం హద్దులు దాటుతోందని అందువల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అభిమానులు మంచి పనులు చేస్తే బాగుంటుందని ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరహా ఘటనల గురించి అజిత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అజిత్ కు రోజురోజుకు అభిమానులు పెరుగుతున్నారు.అజిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.తునివు అజిత్ 61వ మూవీ కాగా అజిత్ 62వ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
అజిత్ 62వ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు.అటు అజిత్ కు ఇటు సాయిపల్లవికి ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.