సూపర్ స్టార్ కృష్ణ టార్జాన్ సినిమాల్లో నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు.ఆయన నటించిన తొలి జానపద చిత్రమే ఆయనకు మల్టీ స్టార్స్ గా మొదటి సినిమా కావడం విశేషం.
ఆ సినిమా మరేదో కాదు ఇద్దరు మొనగాళ్లు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది విఠలాచార్య.
ఈ సినిమాలో హీరోగా కాంతారా నటించిన అప్పటికే గూఢచారి 116 విడుదల అయ్యి వంద రోజులు ఆడిన సందర్భంగా ఇద్దరు మొనగాళ్లు చిత్రంలో నటించాల్సిందిగా కృష్ణ గారిని విఠలాచార్య అడిగారట.అలా ఈ సినిమా కోసం మొట్టమొదటిగా టార్జాన్ వేషంలో కనిపించారు కృష్ణ.
టార్జాన్ సినిమా కాబట్టి ఈ సినిమాలో ఎక్కువ భాగం ఆయన మాట్లాడరు కేవలం హావాభావలతోనే అన్ని చెప్తూ ఉంటారు.

ఇక కైకాల సత్యనారాయణ ఈ సినిమాలో గజ పురాధిపతి సింహ బాహు అనే ఒక రోల్ లో నటించగా, ఆయనకు భార్య పాత్రలో పుష్ప కుమారి శీలావతి పాత్రలో నటించారు.వీరికి పుట్టిన సంతానమే కాంతారావు మరియు కృష్ణ.పెద్ద వాడైన రాజశేఖరుడి పాత్రలో కాంతారావు నటించగా, ఎక్కడో దూరంగా అడవిలో పెరిగిన చిన్న కుమారుడిగా సూపర్ స్టార్ కృష్ణ కనిపించారు.
ఇక కృష్ణకుమారి మరియు సంధ్యారాణి ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించారు.కృష్ణకు జోడిగా నటించిన సంధ్యా రాణి అంతకు ముందే కన్నె మనసులు అనే సినిమాలో కూడా జంటగా నటించింది.
ఇలా వీరిద్దరూ జోడిగా నడిచిన రెండవ సినిమా ఇద్దరు మొనగాళ్లు.

వాస్తవానికి ఈ సినిమా మొదట ఫిబ్రవరి 16 1967లో విడుదల చేయగా ఆ రోజుల్లో ఇప్పట్లో లాగా 24 గంటలకు కరెంటు ఉండేది కాదు తీవ్రమైన కరెంటు కోతతో ఉండేవారు అప్పటి జనాలు ఇక థియేటర్లో జనరేటర్లు కూడా ఉండకపోవడంతో విడుదల వాయిదా వేసుకున్నారు చిత్ర బృందం.ఆ తర్వాత ఆ విద్యుత్ కార్మికులు సమ్మె కూడా చేశారు ఆ సమ్మె ముగిసిన తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవని నిర్ధారణ చేసుకొని మార్చి 3 1967న విడుదల చేశారు.ఈ సినిమా విడుదలైన తర్వాత టార్జాన్ గా నటించిన కృష్ణని చూసి ఆయన అభిమానులంతా కూడా ఫుల్ ఖుషి అయ్యారు.







