నటుడు చలపతిరావు ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఆ సమయంలో ఆయన అంతకు ముందు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి.
అలా వైరల్ అయిన వాటిల్లో ఒక సంఘటన ఏంటి అంటే ఆయన సావిత్రి గారి గురించి చెబుతూ, సావిత్రితో ఏదైనా సీన్ ఉందంటే చాలు ఎన్టీఆర్, అక్కినేని లాంటి వారు సైతం ఎంతో జాగ్రత్త తీసుకునేవారు.తన ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులందరికీ కూడా తనవైపు ఎక్కడ తిప్పుకుంటుందో అనే భయం తనతో పాటు నటించే మిగతా నటీనటులకు బాగా ఉండేది.
అందుకే ఆమె పక్కన ఎవరైనా నటించి ఆమెను కాదని మెప్పించాలంటే ఎంతో కష్టంగా ఉండేది అంటూ చలపతిరావు చెప్పుకొచ్చారు.

అయితే నటన విషయంలో సావిత్రి గొప్పదే కానీ ఆవిడ కంటే కూడా రెండాకులు ఎక్కువ చదివిన మరొక నటి ఎస్.వరలక్ష్మి.ఇది ఆమె నటించిన సినిమాలను చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది.
పైగా ఆ రెండాకులు ఎందుకు ఎక్కువ అంటే అది ఆమె గాత్రానికి.జస్ట్ వరలక్ష్మి నటించిన సినిమా ఒకటి సత్యహరిశ్చంద్ర.
ఈ సినిమాలో ఆమె చంద్రమతి గా నటించింది.ఇది ఒక శోక రసంతో కూడిన సినిమా.
ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించింది.పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చిత్తూరు నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, ముక్కామల వంటి ఎంతో పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉంది అనే ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటిస్తూనే నటించడంతోపాటు పాటలు పద్యాలు ఆవిడే పాడారు.

సత్యహరిచంద్ర అనే పేరు ఉంది కాబట్టి ఎన్టీఆర్ హీరో అని అనుకుంటాం.కానీ ఈ సినిమాలో నిజమైన హీరో అంటే వరలక్ష్మి.మరి ముఖ్యంగా ఆమె క్లైమాక్స్ లో నటించిన విధానం చూస్తే మీరు కల్లార్పలేరు.పాత్రకు సంబంధించిన ఔచిత్యం, నటన, భాష అనే ఈ మూడు విషయాలు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో వరలక్ష్మి అలా కనిపిస్తుంది.
పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక కాటి కాపరి.అప్పటి వరకు విభిన్నమైన పాత్రలో చూసిన ఆయనను కాటి కాపరిగా చూడలేక జనాలు ఆ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేశారు.
నిజానికి వరలక్ష్మీ పాత్ర కోసం భానుమతిని తీసుకుందామని ఎవరో చెప్పారట చక్రపాణి గారికి.కానీ భానుమతి ఏడిస్తే ఎవరు చూస్తారయ్యా.ఆమె ఎవరినైనా ఏడిపిస్తే జనాలకు చూడటం ఇష్టం అంటూ సరదాగా అన్నారట.