సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ … ఈ పేరు దాదాపుగా 30 ఏళ్లుగా వింటూనే ఉన్నాం.ఈ బ్యానర్ స్థాపించింది ఏం ఎస్ రాజు.
రాజు గారి తండ్రి రాయప రాజు పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో తమకు ఉన్న కొన్ని వందల ఎకరాలు అమ్ముకొని మద్రాసు కి మైగ్రేట్ అయ్యారు.రోజా మూవీస్ ఓనర్ ఆయన అర్జున రాజు రాయప రాజు కి కజిన్ అవుతాడు.
అందుకే తాను నిర్మాత అవ్వాలని మద్రాసు వెళ్ళిపోయారు.తండ్రి దారి లోనే ఏం ఎస్ రాజు కూడా నిర్మాత అయ్యారు.
తండ్రి కంపెనీ నీ పక్కన పెట్టి తన కొడుకు సుమంత్ పేరుతో బ్యానర్ నీ స్థాపించాడు.

ఈ బ్యానర్ స్థాపించి రాజు గారు తీసిన మొదటి సినిమా శత్రువు.ఈ సినిమా సక్సెస్ కావడం తో వరసగా సినిమాలు తీయాలని భావించారు.రాజు తీసిన మొదటి మూడు సినిమాల్లో కూడా హీరోయిన్ గా విజయశాంతి ఉండడం విశేషం.
అలాగే వెంకటేష్ తో ఉన్న స్నేహంతో శత్రువు, దేవి పుత్రుడు వంటి తీశారు.ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా కొనసాగుతూనే రిపీటెడ్ గా కాంబినేషన్స్ నీ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏకంగా నాలుగు సినిమాలు నిర్మాతగా M S రాజు గారు వ్యవహరించారు.అవి శత్రువు, పోలీస్ లాకప్, దేవి, దేవి పుత్రుడు.

ఇక కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో కూడా ఎప్పుడు ముందుండేవారు ఎంఎస్ రాజు.మనసంతా నువ్వే సినిమాతో అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా VN ఆదిత్య లాంటి దర్శకుని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.ఆ తర్వాత నీ స్నేహం సినిమాతో పరుచూరి మురళి అనే దర్శకుడు సైతం ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.వర్షం సినిమాకి శోభన్ కి ఇది రెండవ సినిమా అయినప్పటికీ మొదటి ఘనవిజయం సాధించిన చిత్రం కావడం విశేషం.
కొరియోగ్రాఫర్ గా, నటుడుగా ఉన్న ఆ ప్రభుదేవా కి దర్శకుడుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తొలి అవకాశం కూడా రాజుగారు ఇచ్చారు.







