ఈ భూ ప్రపంచంలో అత్యంత క్రూరమైన మాంసాహార జీవులలో సింహాలు ముందు వరసలో ఉంటాయనడంలో సందేహం లేదు.ఇవి పుట్టిన సమయం నుంచి చనిపోయేంతవరకు రోజూ ఏదో ఒక జంతువును చంపేసి తింటూనే ఉంటాయి.
అయితే ఒకప్పుడు సింహాలు అడవిలో మాత్రమే ఉండేవి.కానీ కొందరు ప్రజలు వాటిని పట్టి ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు.
వాటితో సర్కస్‌లు చేయిస్తున్నారు.వాటిని బంధించి తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.
ఒక్కోసారి వాటి మంచితనాన్ని బలహీనతగా భావించి రెచ్చిపోతున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఒక బాలుడు సింహం నోట్లో ఏకంగా చెయ్యి పెట్టి కొరుకు కొరుకు అంటూ పరాచకాలు ఆడాడు.
అది చాలాదన్నట్టు సింహాల మొఖాలపై కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో @gir_lions_lover అనే అకౌంట్ ఈ షాకింగ్ వీడియోను పంచుకుంది.ఈ క్లిప్‌లో ఓ బాలుడు రెండు సింహాలకు చాలా దగ్గరగా వెళ్లడం చూడవచ్చు.
ఆ తర్వాత ఒక సింహం నోట్లో తన చేతిని పెట్టాడు.అది పెంపుడు సింహం అయ్యింది కాబట్టి అతడి చేతిను కొరికేయలేదు.
కాకపోతే చేతిని తన నోటిలో కాసేపటి దాకా ఉంచుకుంది.దాంతో ఆ బాలుడు సింహం ముఖంపై ఒక దెబ్బ వేసి తను చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.
తర్వాత ఇంకొక సింహం మూతిపై కొడుతూ కనిపించాడు.
అవి చిన్న సింహాలైనా వాటికి బాగా చిరాకేస్తే దాడికి దిగే ఛాన్స్ ఎక్కువ.అదే జరిగితే ఆ పిల్లోడు తన చేయో, కాలో లేకపోతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది.ఈ ప్రమాదాన్ని తెలుసుకోకుండా చిన్నపిల్లాడిని సింహాల వద్దకు తీసుకెళ్లడం చాలా పెద్ద తప్పు.
అదే విషయాన్ని నెటిజన్లు కూడా నొక్కి చెప్తున్నారు.వీడియో చూస్తుంటేనే తమకు చాలా ఆందోళనగా అనిపించిందని, అలాంటిది పిల్లలను అసలు ఊహించని ప్రవర్తన గల సింహాల వద్దకు పంపించడం చాలా మూర్ఖత్వమని కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.