నారప్పను మామూలుగా రిలీజ్ చేయడం లేదు కదా!

ఈ మధ్య కాలం లో పాత సినిమా లు రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం.పవన్ కళ్యాణ్ మహేష్ బాబు చిరంజీవి ప్రభాస్ ఇలా చాలా మంది హీరోల యొక్క పాత సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

 Venkatesh Narappa Movie Re Release , Venkatesh , Narappa Movie , Suresh Babu, Pr-TeluguStop.com

కొన్ని సినిమాలు ఒక్క షో లేదా రెండు షోలకు పరిమితం అవ్వగా కొన్ని సినిమా లు మాత్రం ఒక రోజు రెండు రోజులు పూర్తి ఆటలు కొనసాగింది.ఇప్పుడు వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సురేష్ బాబు ఏర్పాట్లు చేశాడు.

వచ్చే వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

సాధారణంగా ఇలాంటి రిలీజ్ లు హడావిడి లేకుండా జరుగుతాయి.

కానీ సురేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నారప్ప సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం ఆసక్తిగా ఉంది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.కరోనా సమయం లో నారప్ప సినిమా ను డైరెక్ట్ ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.

ఆ సమయం లో వెంకటేశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నారప్ప సూపర్ హిట్ అయింది.థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా భారీ కలెక్షన్స్ నమోదు అయ్యి ఉండేవి అంటూ వెంకటేష్ అభిమానులు ఇప్పటికీ అభిప్రాయం చేస్తున్నారు.అందుకే సురేష్ బాబు ఈ సినిమా ను ఇప్పుడు థియేటర్ రిలీజ్ కి సిద్ధం చేశారు అని సమాచారం అందుతుంది.

ఏదో నార్మల్ గా రిలీజ్ చేశాము అన్నట్లుగా కాకుండా భారీ ఎత్తుగానే ప్రమోట్ చేస్తూ విడుదల చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube