రానా హీరో గా గుణశేఖర్ దర్శకత్వం లో హిరణ్య కశ్యప అనే సినిమా రాబోతుంది అంటూ చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు చర్చలు జరిగాయి.
వందల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తాము పెట్టబోతున్నట్లు సురేష్ బాబు పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. రానా మరియు గుణశేఖర్ కాంబినేషన్ లో హిరణ్య కశ్యప సినిమా ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా వస్తుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తాజాగా సురేష్ బాబు షాకింగ్ విషయాన్ని తెలియజేశాడు.
ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అంటూ సురేష్ బాబు ని మీడియా వారు ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ సినిమా లేదు అన్నట్లుగా పేర్కొన్నాడు.
అయితే సినిమా పూర్తిగా క్యాన్సిల్ చేయడం లేదని దక్షకుడు గుణశేఖర్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని, కచ్చితం గా ఈ సినిమా స్థాయికి తగ్గట్లుగా ఒక అద్భుతమైన ప్రతిభావంతుడిని దర్శకుడి గా తీసుకొచ్చి సినిమా ను నిర్మిస్తాను అన్నట్లుగా సురేష్ బాబు పేర్కొన్నాడు.
తాను మొదటి నుండి చెప్తున్నట్లుగానే హిరణ్య కశ్యప సినిమా కు వందల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లుగా కూడా సురేష్ బాబు పేర్కొన్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా లకు సంబంధించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పెద్ద సినిమా ల జోలికి వెళ్ళను అంటూనే హిరణ్య కశ్యప సినిమా ను తాను వేరే నిర్మాతలతో కలిసి నిర్మించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ముందు ముందు హిరణ్య కశ్యప ఖచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.సురేష్ బాబు ఇంకా కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు.కానీ ఆయన తనయుడు రానా మాత్రం హిరణ్య కశ్యప సినిమా విషయంలో అంటి ముట్టనట్లు ఉంటున్నాడు.