టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమంత ఇటీవల యశోద సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగు తో పాటు తమిళం లో కూడా ఈ సినిమా రూపొందింది.
అక్కడ ఇక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టు కోవడం ఖాయం అంటూ నిర్మాతలు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించినంత వసూలు తమిళనాడు లో దక్కించు కోలేదు.
తమిళనాడు ఈ సినిమా లో ఒక డబ్బింగ్ సినిమా గా ప్రేక్షకులు భావించారు.
తమ హీరోయిన్ సమంత నటించిన సినిమా అన్నట్లుగా యశోద ను చూడకుండా లైట్ తీసుకున్నారు.అందుకే అక్కడ కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే యశోద సినిమా కి లభించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల రూపాయల షేర్ ని నమోదు చేసింది.
తమిళనాట కూడా మినిమంగా ఐదు నుండి ఏడు కోట్ల రూపాయల షేర్ దక్కించుకుంటుందని అంతా ఊహించారు.కానీ కోటిన్నర రూపాయల షేర్ మాత్రమే రావడం తో అంతా అవాక్కు అవుతున్నారు.
సమంత ను అక్కడి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదా లేదంటే యశోద చిత్ర యూనిట్ సభ్యులు తమిళనాడు మంచి పబ్లిసిటీ చేయలేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా చర్చలు చేస్తున్నారు.సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఆ సింపతీ తో యశోద సినిమా కి ఒక మోస్తరు కలెక్షన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి, కానీ తమిళనాడు మాత్రం ఈ సినిమా ను పట్టించుకోలేదు.సమంత ప్రస్తుతం ఖుషి సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు షూట్ దశలో ఉన్నాయి.