సాయితేజ్ హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విరూపాక్ష మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వగా ఈ మూవీ టీజర్ గ్లింప్ల్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముగ్గురు భాగస్వాముల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది.
హర్రర్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమాకు లింక్ ఉంది.సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే కాంతార తరహా కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.అదే సమయంలో కాంతార సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన అజనీష్ లోకేశ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని సమాచారం.
కొంతకాలం గ్యాప్ తర్వాత సాయితేజ్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాతో సాయితేజ్ ఖాతాలో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అని నెటిజన్లు చెబుతున్నారు.
ఈ సినిమా సాయితేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయితేజ్ మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్నమైన కథలకు ఓటేస్తుండటం గమనార్హం.
నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ తో ఉన్న అనుబంధం వల్లే ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో పాటు సాయితేజ్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడనున్నాయి.
సాయితేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.