చిరంజీవి, బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కావడంతో పాటు ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విషయంలో ముందువరసలో ఉంటారు.2023 సంక్రాంతికి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.బాలయ్య సినిమా షూట్ ఆలస్యం కావడం, చిరంజీవి పండుగలకు తన సినిమాలను రిలీజ్ చేయాలని ఫిక్స్ కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.
తమ సినిమాలకు భారీ స్థాయిలో నష్టం అని తెలిసినా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సంక్రాంతి కానుకగా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
అయితే తాజాగా అశ్వనీదత్ తెలుగు తమిళ సినిమాల వివాదం గురించి స్పందిస్తూ ఒకే నిర్మాత పండుగకు తన రెండు సినిమాలను విడుదల చేయవచ్చా? అని ప్రశ్నించారు.ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అశ్వనీదత్ ఈ కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లు విన్న నెటిజన్లు దమ్ముంటే చిరంజీవి, బాలయ్యలను అశ్వనీదత్ అడగాలంటూ కామెంట్లు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలకు కేటాయించిన స్థాయిలో తమిళ రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయిస్తారా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.బాలయ్య, చిరంజీవి అశ్వనీదత్ కు సన్నిహితులేనని అడిగి డౌట్స్ గురించి క్లారిటీ తెచ్చుకోవచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
నిర్మాతల మండలి సైతం తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిందే తప్ప తమిళ సినిమాలను అడ్డుకుంటామని చెప్పలేదనే సంగతి తెలిసిందే.అశ్వనీదత్ అనవసరంగా వివాదాన్ని పెద్దది చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.తమిళనాడులో ఒక్కరోజు తేడాతో బీస్ట్, కేజీఎఫ్2 సినిమాలు విడుదల కాగా కేజీఎఫ్2 సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు దక్కలేదు.
వారసుడు సినిమా విషయంలో కావాలని వివాదాలను సృష్టిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ కామెంట్ల విషయంలో అశ్వనీదత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.