ఇదిగో ఇందుకేనేమో మన సౌత్ సినిమా పరిశ్రమలను పీత బుర్రలతో పోలుస్తారు బాలీవుడ్ వారు.ఎందుకంటే ఒక పీత మరొక పీతను పైకి ఎదగనివ్వదట.
ఇప్పుడు ఈ పీతల గోల ఏంటి అనుకుంటున్నారా ? వస్తున్నా.అక్కడికే వస్తున్నా.
అసలు విషయం ఏమిటి అంటే కాంతారా సినిమా ప్రస్తుతం 400 కోట్ల కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ అయ్యింది.ఈ కలెక్షన్స్ మొత్తంలో కన్నడ ఇండస్ట్రీ లో 168 కోట్లు.
ఈ మాత్రం కలెక్షన్స్ రావడంలో పెద్ద వింతేమీ లేదు.ఈ సినిమాను కన్నడిగులు నెత్తిన పెట్టేసుకున్నారు.ఇక తెలుగు వారు కూడా బాగానే ఓన్ చేసుకున్నారు.60 కోట్ల కలెక్షన్స్ తో తెలుగు నాట దుమ్ము దులిపింది.
మన తెలుగు వారికి నచ్చితే కన్నడ కాంతారా పెద్ద విషయమా చెప్పండి. రుమేనియా, టర్కీ సినిమాలను కూడా ఆదరిస్తారు.ఇక హిందీ లో దాదాపు 100 కోట్లు కలెక్షన్ రాబట్టింది.చీప్ గ్రాఫిక్స్, కంటెంట్ లేని బాలీవుడ్ స్టార్స్ సినిమాలను సైతం తిరస్కరిస్తూ సౌత్ సినిమాకు హిందీ ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు.
ఇక అసలు విషయం ఏంటి అంటే తమిళనాడు లో ఈ సినిమా కు తిరస్కారం ఎదురవ్వడం.కేవలం 12 కోట్లతో తమిళ ప్రేక్షకుల నుంచి తిరస్కరించబడింది కాంతారా మూవీ.
ఇందుకు చాలా పెద్ద కారణమే ఉంది.వాస్తవానికి మణి రత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా కేవలం తమిళనాడు లో మినహా తెలుగు, కన్నడ మరియు హిందీ వారికి ఎవ్వరికి నచ్చలేదు.
ఎందుకంటే పాత్రలు పరిచయానికి గంట సమయం తీసుకున్న డైరెక్టర్ పూర్తి స్థాయి తమిళ రాజుల సినిమా తీస్తే ఎవరికి నచ్చలేదు.దాంతో కేవలం తమిళనాడు లో మాత్రమే సూపర్ హిట్ అయ్యి అన్ని భాషల్లో ఫ్లాప్ అయ్యింది.మాములుగా ఎదో ఒక విషయంలో ఎల్లప్పుడూ కన్నడ వారితో జాతి వైరం పెట్టుకోవడం తమిళులకు మామూలే.దాంతో కన్నడిగులు ఎలాగూ పొన్నియన్ ని రిజెక్ట్ చేసారు కాబట్టి తమిళ నాట కాంతారా సినిమా రిజెక్ట్ చేయబడింది.
ఏదేమైనా తమిళ ప్రేక్షకుల వారి బాషా విషయంలో మాత్రం అందరు ఒకే తాటి పై ఉండటం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం.