తెలుగులో ప్రసారం అవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసావత్తరంగా సాగుతోంది.రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతూ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తూ ఆ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ తగ్గించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి దాదాపుగా 5 లక్షల కంటె ఎక్కువగానే తగ్గించేసాడు బిగ్ బాస్.
ఇది ఇలా ఉంటే తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు.ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌస్ లో కొనసాగడం కోసం అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు.
ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి మంచి అవకాశాన్ని ఇచ్చాడు.ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు కఠినమైన టాస్క్ ఇవ్వడంతో పాటు బిగ్ బాస్ ప్రైజ్ మనీ లో నుంచి కోతులు కోయడం కూడా మొదలుపెట్టేసాడు.
ఇక టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి ఈపాస్ తనకు వద్దంటూ టాస్క్ ని ఆడను అని తేల్చి చెప్పేశాడు.ఇక హౌస్ లో అందరూ చర్చించుకున్న తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఫైమా రేవంత్ శ్రీహన్ పాటిస్పేట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో భాగంగా ఒక పైపు లాంటిది మెడపై పెట్టుకోగా దానికి ఒక సంచిలో ఏదో బరువున్నవి రిమైనింగ్ కంటెస్టెంట్ టాస్క్ లో ఉన్న కంటెస్టెంట్లకు వేయాలి.
ఈ క్రమంలోని శ్రీహాన్ రేవంతులకు ఆ బ్యాగులు ఎక్కువగా పడడంతో చివరికి శ్రీహన్ ఆ బరువు మోయలేక కింద పడిపోయాడు.పైమాకు కేవలం రెండు బ్యాగులు మాత్రమే రావడంతో బాగా ఎంజాయ్ గా నిలబడి చూస్తూ ఉంది.ఇక రేవంత్ కూడా ఆ నొప్పిని భరించలేక కింద పడిపోతూ ఉండగా హౌస్ మీద పట్టుకోడానికి రావడంతో ఎవరూ దగ్గరికి రావద్దు అంటూ ఆ బరువును మళ్లీ భుజాలపై వేసుకొని గట్టిగా అరిచాడు.