వివిధ దేశాలలో ప్రపంచ జనాభా పెరుగుతున్న తరుణంలో చిన్న కుటుంబం-చింతలు లేని కుటుంబం, ఒక్కరు ముద్దు-ఇద్దరు వద్దు అనే నినాదాలు పెరిగాయి.అయినప్పటికీ ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతూనే ఉంది.
ఈ తరుణంలో ప్రపంచ జనాభా నవంబర్ 15 నాటికి 800ల కోట్లకు చేరింది.ఈ ఘటన తర్వాత ఇంటర్నెట్లో అనేక వీడియోలు, పోస్ట్‌లు హల్చల్ చేస్తున్నాయి.ఫన్నీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదే కోవలో 9 మంది పిల్లలను సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తున్న వ్యక్తి వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది.
దీనిని జైకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలను తీసుకువెళుతున్నట్లు కనిపించాడు.ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే.
సైకిల్‌పై ఒకరో ఇద్దరో ప్రయాణిస్తుంటారు.అయితే ఏకంగా 9 మందిని ఓ వ్యక్తి ఎక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ముగ్గురు పిల్లలు వెనుక కూర్చొని ఉండగా, వారిలో ఒకరు వెనుక ఉన్న ఇతరులపై నిలబడి మనిషి భుజాలను పట్టుకున్నారు.ఇద్దరు పిల్లలు ముందు ఉన్నారు.
ఒకరు నేరుగా చక్రం పైన కూర్చున్నారు.ఆ వ్యక్తి సైకిల్‌పై వెళుతున్నప్పుడు ఇద్దరు పిల్లలను కూడా తన చేతుల్లో ఎక్కించుకున్నాడు.
ఈ వీడియో నవంబర్ 15న షేర్ చేయబడింది.అప్పటి నుండి 1.86 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది.ఇది పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
తాము ఎక్కడా ఇలాంటి దృశ్యం చూడలేదని పలువురు పేర్కొంటున్నారు.సైకిల్‌పై మహా అయితే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లడం చూశామని అయితే ఇలా 10 మంది వెళ్లడం నిజంగా ఆషామాషీ కాదని కామెంట్లు చేస్తున్నారు.