తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలు జరగమని, సాధారణ ఎన్నికలు జరుగుతాయి అని , ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలంటూ టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు.అయితే మొదటి నుంచి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఈ మేరకు కేసిఆర్ కసరత్తు చేస్తున్నారని, పార్టీ కీలక నాయకులంతా అనేక సందర్భాల్లో సన్నిహితులు వద్ద వ్యాఖ్యానించారు.
సాధారణ ఎన్నికల వరకు ఉంటే బిజెపి మరింతగా బలపడి తమకు గట్టి పోటీ ఇస్తుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పడం వెనుక కారణాలు ఇప్పటివరకు ఎవరికీ అంతుపట్టలేదు.
అయితే ఇక్కడే కేసీఆర్ తన లాజిక్ ను ఉపయోగించారు.సాధారణ ఎన్నికల గడువుకు ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే అది ముందస్తు కాదనే లాజిక్ ను కేసీఆర్ ఇప్పుడు ఉపయోగించబోతున్నారట.
ఇక అనేక సందర్భాల్లో ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉందంటూ కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది డిసెంబర్లో జరగాల్సి ఉంటుంది.
అంటే 13 నెలల సమయం ఉంటుంది కానీ కెసిఆర్ మూడు నెలల సమయం తగ్గించి 10 నెలలు ఉందంటూ ప్రస్తుతం చెబుతుండడంతో ముందస్తు ఎన్నికల ఆలోచన కచ్చితంగా ఉందని, ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం నమ్ముతున్నారు.
బిజెపి తెలంగాణలో బలపడే సమయం ఇవ్వకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని స్థాపించారు.దీనికి ఎన్నికల సంఘం గుర్తింపు లభించగానే టిఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ లో విలీనం అయిపోతుంది.
ఇక దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలంటే తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యి ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని లక్ష్యంతో కేసిఆర్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.