తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్న హీరోలలో కృష్ణ ఒకరు.ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్లలో చాలామంది హీరోలుగా సక్సెస్ సాధించడంతో పాటు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
కృష్ణ పార్థివదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు మహేష్ లో కృష్ణను చూసుకుంటామంటూ కామెంట్లు చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి కృష్ణగారికి మేము అభిమానులమని దర్శకనిర్మాతలకు మేలు జరిగేలా కృష్ణ నిర్ణయాలు తీసుకునేవారని అభిమానులు తెలిపారు.
ఫ్యాన్స్ ను ప్రేమించే అతికొద్ది మంది హీరోలలో కృష్ణ ఒకరని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.కృష్ణ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.కృష్ణగారు తన సినిమాలతో చరిత్ర సృష్టించారని అభిమానులు పేర్కొన్నారు.కృష్ణగారు భౌతికంగా దూరమైనా తమ హృదయాల్లో నిలిచి ఉన్నారని ఫ్యాన్స్ వెల్లడించారు.
మహేష్ బాబుకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కృష్ణ పార్థివదేహాన్ని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు హాజరయ్యారు.కృష్ణ అంటే తమకంతో అభిమానమని ఆయన ఫ్యాన్స్ పచ్చబొట్టును చూపిస్తున్నారు.కృష్ణగారు చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కృష్ణ ఏ పని చేసినా ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లేవారని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావని ఫ్యాన్స్ చెబుతున్నారు.కృష్ణ మహానటుడు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.కృష్ణ తన డైలాగ్ డెలివరీతో ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కృష్ణ తన సినీ కెరీర్ లో ఎక్కువగా ఫ్యామిలీ కథాంశాలలో నటించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.కృష్ణ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవని ఫ్యాన్స్ చెబుతున్నారు.కృష్ణగారు లెజెండ్ అని ఆ తరం ముగిసిపోవడం బాధ కలిగిస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.