ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, ఒత్తిడి తదితర కారణాల వల్ల జుట్టు రాలడం, చిట్లడం, పొడి బారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.వీటిని నివారించుకుని స్ట్రాంగ్ షైనీ అండ్ స్మూత్ హెయిర్ కావాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే.
ఈ రెమెడీ హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడమే కాదు కుదుళ్ళను బలోపేతం చేసి జట్టును స్మూత్‌గా మరియు షైనీగా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గుడ్లులోని పచ్చ సొనను మాత్రం వేసుకోవాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
అయిదారు నిమిషాల పాటు కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.జుట్టు కుదుళ్లు బలంగా మరియు దృఢంగా మారతాయి.డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.కురులు స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తాయి.కాబట్టి, ఎవరైతే హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారో.వారు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ప్రయత్నించండి.
మంచి ఫలితాలు మీసొంతం అవుతాయి.