జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.దీనిలో భాగంగా దీపావళి తర్వాత ఆయన మళ్లీ ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం.
నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే ఉండే విధంగా ప్రణాళిక రచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ ప్రణాళికలో భాగంగా బీఆర్ఎస్ కార్యక్రమాలను కేసీఆర్ విస్తృతం చేయనున్నారని తెలుస్తోంది.
బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు పలు శాఖలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీలో ములాయం సంతాప సభను బట్టి కేసీఆర్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.